![]() |
![]() |

బీబీ కేఫ్ లోకి వాసంతి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆరియానా ఎన్నో ప్రశ్నలు వేసింది. అలాగే టాప్ 1 లో రేవంత్ ఉంటాడని చెప్పింది. అలాగే ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పింది.
"బిగ్ బాస్ ఫినాలే చూస్తుంటే నేను కూడా ఉండి ఉంటే బాగుండనిపిస్తోంది. నాకు బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ మూమెంట్ ఏమిటి అంటే నా పేరెంట్స్ ని కలవడం.. అలాగే ఆడియన్స్ కి బాగా దగ్గరవడం. నాకు హౌస్ లో ఎవరితో అంత అటాచ్మెంట్ లేదు. నా గేమ్ ఆడుకుని నేను వచ్చేసాను. కానీ ఫైనల్ వీక్ లో మాత్రం నేను కీర్తికి, రేవంత్ కి సపోర్ట్ చేయాలి అనిపించింది. ఐతే హౌస్ లో ఎన్ని గొడవలు పడినా ఎండ్ ఆఫ్ ది డేలో నాకు రేవంత్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కీర్తి నాకు వచ్చే ముందర బాగా దగ్గరయింది. చాలామంచి ఫ్రెండ్ నాకు. నేను హౌస్ లోకి వెళ్లే ముందు పాత ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఆడిన గేమ్స్ చూసి వెళ్ళాల్సింది. కానీ అలా బ్లాంక్ గా వెళ్ళిపోయాను. ఇప్పుడు చూసుకుంటుంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఫినాలే వీక్ లో ఇనాయ ఉంటే బాగుండు అనిపించింది. ఆదిరెడ్డి బాగా ఆడుతున్నాడు. మ్యూచువల్ ఓట్స్ విషయానికి వస్తే గీతూ ఓట్లన్నీ ఆదిరెడ్డికి, అలాగే మరీనా ఓట్లన్నీ రోహిత్, నా ఓట్లన్నీ రేవంత్ కి వెళ్తాయి" అని చెప్పింది వాసంతి. కొత్తగా మాటీవీలో రెండు ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా అందుకు నీకు కంగ్రాట్యులేషన్స్ అని చెప్పింది ఆరియానా.
![]() |
![]() |